సిరాన్యూస్, ఇచ్చోడ
బోరిగామలో ప్రారంభమైన మొహర్రం వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలో మొహర్రం వేడుకలు సోమవారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. పీర్ల బంగ్లాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పీర్ల బంగ్లాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీర్ల నిర్వాహకులు మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు 10 రోజులపాటు మొహర్రం వేడుకలు నిర్వహిస్తామని తెలియజేశారు. మొహరం పండుగను గ్రామంలో కులమతాలకు అతీతంగా ఘనంగా జరుపుకుంటామని వారు తెలియజేశారు. చంద్రవంక దర్శనం ఇవ్వడంతో ముతావలీలు పీర్ల చావిడి ముందు అలై గుంతను తీసి పీర్ల చావడిలో పీర్లను ప్రతిష్టించారు. అలై గుంత వద్ద గ్రామంలో పిల్లలు, యువకులు రోజు హలై బలై ఆటపాటలు ఆడతారు.