సిరాన్యూస్,బోథ్
గ్రామాలలో ప్రారంభమైన మొహర్రం ఉత్సవాలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో కుల మతాలకతీతంగా మొహరం పండుగ ఉత్సవాలను జరుపుకుంటారు. అయితే పండుగ వేడుకలలో ఊరేగించే పీరీలను ఆయా గ్రామాల్లో సిద్ధం చేశారు. వారం రోజులపాటు గ్రామాలలో పండుగ వేడుకలను జరుపుకోవడం అనవాయతీ. ఆదివారం నుండి మంగళవారం వరకు రాత్రులలో పీర్ల ఊరేగింపు ఉంటుంది. బుధవారం మళీదల పేరుతో బోనాలు వేస్తారు. గురువారం రోజంతా పీర్ల ఊరేగింపు ఉంటుంది. భారీ సంఖ్యలో ఆయా గ్రామాల్లో ప్రజలు ఉత్సవాలు పాల్గొంటారు.