తలమడుగు సిరా న్యూస్
బరంపూర్ గ్రామంలో ముజ్గి మల్లన్న పల్లకి ఊరేగింపు
మంగళ హరతులతో స్వాగతం పలికిన మహిళలు
నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం ముజ్గీ మల్లన్న. గ్రామంలోని ముజ్గి మల్లన్న దేవాలయం నుంచి భక్తుల పాదయాత్రతో ప్రారంభమైన మల్లన్న పల్లకి పాదయాత్ర శనివారం తలమడుగు మండల కేంద్రంలోని బరంపూర్ గ్రామనికి వచ్చారు. ఈ సందర్బంగా తలమడుగు మండల యాదవ సంఘం ఉపాధ్యక్షులు దాడి మహేష్ యాదవ్ వారికీ అతిద్యం ఇచ్చారు. ఆదివారం ఉదయం మల్లన్న పల్లకిని గ్రామంలోని పలు వీధుల గుండా దర్శనం ఇవ్వడంతో పలువురు భక్తులు పల్లకిలో ఉన్న ముజ్గి మల్లన్నను భక్తులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా మల్లన్న భక్తులైన దాడి మహేష్ మాట్లాడుతూ 70 సంవత్సరాల నుంచి మల్లన్న దేవాలయం నుంచి ప్రారంభమైన 60 రోజులు పల్లకి పాదయాత్ర నిర్మల్ సారంగాపూర్ గుడిహత్నూర్ ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు బయలుదేరుతుంది మహారాష్ట్ర నుంచి పాట్నా లోని పుణ్య నది అయినటువంటి గంగాలో ముజ్గి మల్లన్నను స్నానం చేయించి అనంతరం తిరిగి ప్రయాణంలో మల్లన్న దేవాలయానికి తీసుకువచ్చి మల్లన్న ప్రోక్షణం చేసి పునః ప్రతీష్టాపన చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో నమసన్వార్ యాదవ్, దాడి మల్లేష్, దాడి నరేష్, మెరుగు అశోక్, మౌనిష్ రెడ్డి, దాడి హరీష్ యాదవ్ ముజ్గి మల్లన్న భక్తులు తదితరులు ఉన్నారు