సిరాన్యూస్,భీమదేవరపల్లి
ముల్కనూర్ లో వివాహిత అదృశ్యం
వివాహిత అదృశ్యమైన సంఘటన ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని కొత్తకొండ గ్రామానికి చెందిన ఎనగందుల నాగమణి అనే వివాహిత జూన్ 19 వ తేదీ నుంచి కనపడకుండా పోయింది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టు పక్కల, బంధువుల ఇండ్లలో ఆరా తీశారు. ఎక్కడా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో ఆమె భర్త ఎనగందుల రాజు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు.