Mulkanur: ముల్కనూరులో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయింపు

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
ముల్కనూరులో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయింపు
* న్యాయం కోసం నెల రోజులుగా యువతి పోరాటం
* యువతి ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు
* పరారీలో యువకుడు.. ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులు

ప్రేమించనన్నాడు..పెళ్లి చేసుకొని కలసి జీవిద్దామని ఎన్నో మాటలు చెప్పి చివరకు పెళ్లి అనే సరికి ఓ యువకుడు మొహం ఛాటేయడంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించిన సంఘటన హ‌నుమ‌కొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన బొల్లంపల్లి రంజిత్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీతానగరం మండలం చిన్న కొండపూడి గ్రామానికి చెందిన చిడిపి చంద్రకళ 2011 నుండి ప్రేమించుకున్నారు. రాజమండ్రిలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తూ, ఆరేళ్లుగా సహజీవనం చేశారు. కాగా జులై 9 న తన సొంత గ్రామం ముల్కనూర్ వెళ్లి వస్తానని చెప్పి వచ్చిన బొల్లంపల్లి రంజిత్ తర్వాత పత్తా లేకుండా పోయాడు. రోజులు గడుస్తున్న రాకపోవడంతో చంద్రకళ ముల్కనూరు చేరుకుంది. గత నెల రోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి రంజిత్ ఇంటి ముందు బైఠాయించి, తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. ప్రియుడు రంజిత్ ఆచూకీ కోసం ఎదురుచూస్తుంది. రంజిత్ కుటుంబ సభ్యులే అతన్ని దాచి ఉంచారని సదరు యువతీ ఆరోపిస్తుంది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమ పేరుతో మోసపోయిన చంద్రకళ ఈ నెల 20 న ముల్కనూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై సాయిబాబు దర్యాప్తు చేపట్టి బొల్లంపల్లి రంజిత్ తో పాటు నలుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని బుధవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సైతం బాధితురాలు వినతిపత్రం సమర్పించి వేడుకుంది. బాధితురాలికి పలు సంఘాల నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *