MULUKANUR SRK SCHOOL: ములుకనూర్ ఎస్ఆరేకే పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సిరాన్యూస్, భీమదేవరపల్లి
ములుకనూర్ ఎస్ఆరేకే పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పాఠశాలల్లో పండుగలు మత సామరస్యానికి, ఐక్యతకు నిదర్శనం:  ప్రిన్సిపాల్ కాశిరెడ్డి ఆదిరెడ్డి

దసరా సెలవులు బుధవారం నుంచి ప్రారంభం కానుండడంతో మంగళవారం భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ ఎస్.ఆర్.కే స్కూల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అలరింపజేశారు. విద్యార్థులు రంగురంగుల దుస్తులతో ఆకట్టుకున్నారు. మహిళ ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థినిలు బతుకమ్మ ఆడారు. స్కూల్లో స్పీకర్ల సహాయంతో బతుకమ్మ పాటలు పెట్టుకొని ఉత్సాహంగా పండుగ జరుపుకున్నారు. ఈసందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కాశిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ పండుగలు మతసామరస్యానికి, ఐక్యతకు నిదర్శనం అని అన్నారు. పంచభూతాలలో ప్రకృతిని కాపాడి, దైవంగా భావించే పండుగలలో బతుకమ్మ పండుగ ప్రముఖమైనదని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం కవిత, ఉమామహేశ్వరి, శృతి, ఎం. అశ్విని, భీమేశ్వరి, జి. అశ్విని, అస్మా, అభిలాష్, రామకృష్ణ, శోభ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *