సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ వేదులూరు ప్రవీణ్ ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ గురువారం వారి నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట కౌన్సిలర్స్ అశోక్ స్వామి, పందిరి భూమన్న, కొండ గణేష్ , ధమ్మపాల్ తదితరులు పాల్గొన్నారు.