సిరా న్యూస్,మంథని;
మంథని మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు (గౌడ్స్ వాడ)లో బోరుబావికి మరమ్మత్తు పనులను మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించి మున్సిపల్ సిబ్బంది చేత మరమ్మత్తులుచేయించారు.12వ వార్డు గౌడ్స్ వాడలో నీటి సమస్యలు నివారించుటకు వార్డు ప్రజల సౌక్యార్థం వాటర్ బోర్ మరమ్మత్తు పనులను చేపించినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ సురేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగావార్డు ప్రజలు బోర్ బావికి మరమ్మత్తు పనులు చేపించినందుకు గాను చైర్ పర్సన్ కి కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వేముల లక్ష్మి , కాంగ్రెస్ నాయకులు వేముల సమ్మయ్య, మాచిడి రవితేజ గౌడ్,టి రాజు లతో పాటు పలువురు పాల్గోన్నారు.
==========