సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
తాత్కాలిక డ్రైనేజీ ఏర్పాటు చేయించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం 12వ వార్డు సుభాష్ నగర్ కాలనీలో గత కొద్దిరోజుల నుండి మురికి నీరు ఇండ్లలోకి చేరుతుంది. దీంతో కాలనీవాసులు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానిక కౌన్సిలర్ పౌజియ షబ్బిర్ పాషా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కు తెలియజేశారు. వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ మంగళవారం జేసీబీ సహాయంతో తాత్కాలిక డ్రైనేజీ ఏర్పాటు చేయించి, ఖాళీ స్థలంలో నిలిచినటువంటి మురికి నీరును మురికి కాలువలోకి మళ్లింపు చేయించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ షబ్బిర్ పాష , వార్డ్ స్పెషల్ ఆఫీసర్ సంతోష్ , మెప్మా సిబ్బంది నారాయణ , సుభాష్ నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.