సిరాన్యూస్, ఖానాపూర్
సమస్యల పరిష్కారానికి కృషి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* మున్సిపల్ కార్యవర్గ సర్వసభ్య సమావేశం
పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అధ్యక్షతన ఆగష్టు మాసపు మున్సిపల్ కౌన్సిల్ సర్వ సభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఖానాపూర్ పట్టణంలో సెప్టెంబర్ నెలలో జరగబోయే వినాయక ప్రతిష్టాపన మండపాల వద్ద విద్యుత్ స్తంభాలకు డీపీలు , లైటింగ్ ల ఏర్పాటు గురించి అలాగే గణేష్ల నిమర్జనం రోజున గోదావరి నది తీరం వద్ద గజా ఇతగాల ఏర్పాటు, క్రేన్ వాహనం, గోదావరి నది తీరం వద్ద టెంటు కుర్చీల ఏర్పాట్లపై చర్చించారు. నిమజ్జనం రోజున ప్రధాన వీధులలో త్రాగునీటి ఏర్పాటు చేశాయని తెలిపారు. ఖానాపూర్ పట్టణంలోని అన్ని వార్డులలో ప్రజలు సీజనల్ వ్యాధులకు గురవుతున్నారని, వాటిని దృష్టిలో ఉంచుకొని దోమలు ఏర్పడకుండా దోమల స్ప్రే పిచికారి, రాత్రి వేళలలో ఫాగింగ్ దోమల పొగ పిచికారి చేయాలన్నారు. ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జూ పటేల్ సహకారంతో ఖానాపూర్ పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.సమావేశంలో కౌన్సిలర్స్ నాయకులు కారింగుల సంకీర్తన సుమన్ ,జన్నారపు విజయలక్ష్మి శంకర్,పరిమి లత సురేష్ , ఆఫ్రిన్ అమానుల్లా ఖాన్ , కిషోర్ నాయక్ , అబ్దుల్ కలీల్, కుర్మా శ్రీనివాస్ , ఫౌజియా షబ్బీర్ పాషా, మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.