సిరాన్యూస్,ఖానాపూర్
పారిశుధ్య కార్మికులకు రేయిన్ కోట్లు అందజేత: మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సోమవారం మున్సిపల్ చైర్మన్ రాజు రా సత్యం రేయిన్ కోట్లను అందజేశారు. ఈసందర్బంగా మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో ఫీల్డ్ లెవల్లో పని చేసే కార్మికులకు రేయిన్ కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ కావాలి సంతోష్,మున్సిపల్ కమిషనర్ టి మనోహర్, కౌన్సిలర్లు నాయకులు కిషోర్ నాయక్,అమణుల్లా ఖాన్,పరిమి సురేష్,షబ్బీర్ పాషా,నాయిని సంతోష్,జన్నారపు శంకర్,మున్సిపల్ జవాన్ శంకర్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.