సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని రజక సంఘం ఆధ్వర్యంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పాలాభిషేకం చేశారు. ఈసందర్బంగా మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కోఠి ఉమెన్స్ కళాశాలకు చాకలి ఐలమ్మ పేరును పెట్టినందుకు, చాకలి ఐలమ్మ మనమరాలు శ్వేతకు మహిళా కమిషన్ సభ్యులుగా అవకాశం కల్పించినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు జన్నారపు శంకర్ , పరిమి సురేష్ , మండల అధ్యక్షులు దొనికేని దయానంద్ , నాయకులు తోట సత్యం , రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.