సిరాన్యూస్,ఖానాపూర్
మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 10వార్డులో బుధవారం మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్మా శ్రీను, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.