సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
తల్లి పాలతో బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం తెలిపారు. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 6వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడుతూ పుట్టిన పిల్లలకు డబ్బా పాలను తాగించకుండా, తల్లిపాలను తాగించాలని అన్నారు. తల్లిపాలు తాగిన బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని తెలిపారు. డబ్బా పాలు తాగించడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతారన్నారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మంచి పౌష్టిక ఆహార గుణాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ,నాయకులు, అమనుల్లా ఖాన్ , పరిమి సురేష్ , కిషోర్ నాయక్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , వార్డు స్పెషల్ ఆఫీసర్ రమాదేవి , తదితరులు పాల్గొన్నారు.