సిరాన్యూస్, ఖానాపూర్
నాటిన మొక్కలను సంరక్షించాలి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* ఫారెస్ట్ ఉద్యానవనంలో మొక్కలు నాటిన అధికారులు
నాటిన మొక్కలను సంరక్షించాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పచ్చదనం – స్వచ్ఛదనం కార్యక్రమం నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఫారెస్ట్ అధికారులతో కలసి ఫారెస్ట్ ఉద్యానవనంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పండ్ల మొక్కలను నాటారు. అంతకుముందు గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల నుండి ఫారెస్ట్ ఉద్యానవనం వరకు విద్యార్థులతో కలసి ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజులపాటు ప్రవేశపెట్టిన పచ్చదనం – స్వచ్ఛతనం కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా ముగిసిందని అన్నారు .ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, నాయకులు నాయిని సంతోష్ , అమనుల్లా ఖాన్ , కుర్మా శ్రీనివాస్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , మల్లికార్జున్ రెడ్డి ,పారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు రెంజర్ కిరణ్ కుమార్ , బి.మహేష్ , ఎ.రవీందర్ , మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది, ఫారెస్ట్ అధికారులు సిబ్బంది, మెప్మా సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.