సిరాన్యూస్, ఖానాపూర్
రోడ్డపై పశువులను వదిలితే కఠిన చర్యలు: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
రోడ్డపై పశువులను వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో విచ్చలవిడిగా తిరుగుతున్న పశువులను పట్టుకుని గోశాలకు తరలించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈసందర్బంగా మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడుతూ రోడ్లపై పశువులు తిరుగున్న కారణంగా ప్రజలు ప్రమాదాలకు గురికావడంతో పాటు వ్యాపారస్తులు, కొనుగోలుదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉంచినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.