సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యంకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ముఖ్య సేవ కేంద్రము అబూ పర్వతము (రాజస్థాన్) వారి ఆధ్వర్యంలో రక్షాబంధన్ నిర్వహించారు.ఈ సందర్బంగా సోమవారం రక్షాబంధన్ ప్రతిజ్ఞ పత్రము ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియా విశ్వవిద్యాలయం సభ్యులు రాఖీ కట్టారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ రాఖీ పండుగ అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ల ప్రేమకు ప్రతీక అని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కిషోర్ నాయక్ , మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.