ఎన్ఎమ్ఎమ్ఎస్ స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులను సన్మానించిన మున్సిపల్ చైర్మన్ రమా

సిరా న్యూస్,మంథని;

ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ లో నిర్వహించిన నేషనల్ మీమ్స్ మెరిట్ స్కాలర్షిప్ ప్రతిభ పరీక్షలో మంథని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన వ్యాంసాని విక్రాంత్ మరియు ఇటికాల తేజ శ్రీ విజయం సాధించారు.
ఈ సందర్భంగా మంథని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించగా మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్ఎమ్ఎమ్ఎస్ స్కాలర్షిప్ సాధించిన ఇద్దరు విద్యార్థులు వ్యాంసాని విక్రాంత్ మరియు ఇటికాల తేజ శ్రీ లను మున్సిపల్ చైర్మన్ రమా సురేష్ రెడ్డి సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదవడం వల్ల ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలను ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఉత్తమ విద్యను అందిస్తున్నామనీ, మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రతి సంవత్సరం 8 వతరగతిలో ఎన్ఎమ్ఎమ్ఎస్ స్కాలర్షిప్ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తున్నారని అన్నారు. విజయం సాధించిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలను ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేవరకు కేంద్ర ప్రభుత్యం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని ఎంపీపీ కొండ శంకర్, కౌన్సిలర్ వికె రవి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
=====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *