సిరా న్యూస్,మంథని;
మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన మంథని మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రి రమాసురేష్ రెడ్డి, ఐదు సంవత్సరాల ఎంపిపి పదవీ కాల పరిమితిని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కొండ శంకర్ లను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించినారు. ఎంపిపిగా కొండ శంకర్ ఐదు సంవత్సరాలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఎంతో ఓపిక, పట్టుదల, కృషితో ఎన్నో సమస్యలను పరిష్కరించారని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ కొనియాడారు. అలాగే మంథని మున్సిపల్ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్న పెండ్రి రమను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్లు ఆకుల రాజబాపు, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దేవళ్ల విజయ్ కుమార్, దాసరి లక్ష్మీ-మొండయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీంఖాన్, నాయకులు మంథని విజయ్ కుమార్, బెజ్జంకి డిగంబర్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
================