సిరా న్యూస్,శ్రీకాకుళం
మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది.ఇందులో భాగంగా పారిశుధ్య కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు..కార్మికులు విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంవద్ద నిరసన తెలిపారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరిని పర్మినెంట్ చేసి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.పర్మినెంట్ ఉద్యోగులకు సిపిఎస్ రద్దుచేసి పాత ఫెన్షన్ అమలుచేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు.పట్టణాలు నగరాల్లో చెత్త పేరుకు పోయిన ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తుశుద్ధి లేదనియూనియన్ నాయకులు మండి పడ్డారు..