సిరాన్యూస్, ఆదిలాబాద్
ఎమ్మెల్యే పై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలి: మున్నూరు కాపు సంఘం నాయకుడు సంతోష్
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజక వర్గ ఇన్ చార్జ్ కంది శ్రీనివాస్‌రెడ్డి మున్సిపల్ చైర్మన్ ను ఆహ్వానించలేదని ఎమ్మెల్యే పై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని ఆదిలాబాద్ మున్నూరు కాపు సంఘం నాయకుడు సంతోష్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో జోగు రామన్న, మునిసిపల్ చైర్మన్ పై లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చిందన్నారు. గతంలో ఏ ఏ సభలో , సమావేశాలలో మా మున్నూరు కాపులను ఏమి మన్నారు, కులానికి అవమాన పరిచారన్నారు. అమ్ముడు పోయే జాతి నీ అవమాన పరిచవు, ఈ విషయాన్ని ఎలా మర్చి పోతామన్నారు. హిందూ ఉత్సవ సమితికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ కి ఎలాంటి సంబంధం లేదన్నారు. మున్సిపల్ చైర్మన్ ను ఆహ్వానించలేదని ఎమ్మెల్యే పై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలి అన్నారు. సొంత మీడియా ఉన్నదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మున్నూరు కాపు బిడ్డలు ఎవరు సహించరన్నారు.బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మున్నూరు కాపు, బీజేపీ నాయకులపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. సమావేశంలో సంఘ నాయకులు రఘుపతి, జోగు రవి, ఆకుల ప్రవీణ్, దయాకర్, కేశవు , సంతోష్, శివ, సాయి, మహేందర్ తదితరులు ఉన్నారు.