కారు సైడ్ ఇవ్వలేదని హత్య

సిరా న్యూస్,బాపట్ల;
బాపట్ల జిల్లా చీరాల మండలం అదినారాయణపురం వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. స్థానిక ఈపూరుపాలెం కు చెందిన సయ్యద్ ఆరీఫ్(18) సైకిల్ పై అతని స్నేహితుడు మనోజ్ బైక్ ప్రక్క ప్రక్కన కలిసి వేళ్ళుతుండగా కారుకు అడ్డం వచ్చారని సైడ్ ఇవ్వలేదనే నెపంతో కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఇరువురితో ఘర్షణ దిగారు. మనోజ్ పై దాడి చేసి,అరీఫ్ ను కత్తులతో విచక్షణా రహితంగా గొంతు శరీరభాగాలపై పొడిచి పరారైయ్యారు. తీవ్రరక్తస్రావంలో కొట్టుమిట్టాడుతున్న ఆరీఫ్ ను స్థానికులు చికిత్స నిమిత్తం చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరీఫ్ మృతి చెందాడు. మృతుడు ఆరిఫ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మృతుడు ఆరిఫ్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిగిస్తున్నారు. వరుస హత్యలతో చీరాల ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది.కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *