సిరా న్యూస్,హైదరాబాద్;
పార్టీ శ్రేణులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదుపై నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు సభ్యత్వ నమోదు 50 లక్షల టార్గెట్ ఇచ్చింది జాతీయ నాయకత్వం. అయితే, 15 రోజుల్లో నేతలు 9 లక్షల సభ్యత్వాన్ని మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన 40 లక్షల టార్గెట్ ని 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు నడ్డా. నేతలంతా రెగ్యులర్ గా ప్రజల మధ్యన ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ హామీలపై పోరాటం చేయాలని నేతలకు సూచించారు నడ్డా.ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమానం. మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి. శక్తి కేంద్రాల వేదికగా బలోపేతం చేయండి. ప్రజల్లో ఉండండి. పార్టీని శక్తిమంతంగా తయారు చేయండి. మీరెందుకు రెగ్యులర్ గా ప్రజల మధ్య ఉండడం లేదు..? అధికార పార్టీ హామీలపై పోరాటం చేయాలి కదా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలను, వైఫల్యాలను కూడా ప్రజలకు గుర్తు చేయాలి కదా..? సభ్యత్వ నమోదు కూడా స్పీడ్ గా కావడం లేదు. ఎందుకిలా? 50 లక్షల టార్గెట్ పెట్టుకుని ఇప్పటివరకు 9 లక్షలు మాత్రమే చేస్తారా.?” అని పార్టీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జేపీ నడ్డా.15 రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాలని నడ్డా చెప్పారు. ఎంపీలు, పోటీ చేసిన వారు మండలానికి వెళ్లి సభ్యత్వం కోసం పని చేయాలి. శక్తి కేంద్రం వరకు ఎమ్మెల్యేలు వెళ్లాలి. సభ్యత్వ నమోదు డ్రైవ్ కు మంచి స్పందన వస్తోంది. తెలంగాణలో ఎక్కువ సభ్యత్వం చేయాలని, అధికారంలోకి వచ్చేలా పని చేయాలని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేలా పని చేయాలన్నారు. 15 రోజుల అనంతరం మరోసారి సమావేశం అవుతానని నడ్డా చెప్పారు. కేవలం సభ్యత్వం నమోదు కోసమే నడ్డా ఇక్కడికి వచ్చారు. మూడు ఎమ్మెల్సీ ఎన్నికల సభ్యత్వం కోసం కూడా పని చేయాలన్నారు”.బీజేపీ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ప్రధానంగా బీజేపీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు నడ్డా. పార్టీ నేతల నుంచి వివరాలు రాబట్టారు. అదే సమయంలో వారికి దిశానిర్దేశం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించాలన్న లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదు చేయాలనే టార్గెట్ పెట్టుకుంది. నెల రోజుల్లో ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని దిశానిర్దేశం చేసింది. అయితే, 15 రోజులు అవుతున్నా కేవలం 9 లక్షల సభ్యత్వాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 40 లక్షల చిల్లర సభ్యత్వాలు పూర్తి కాకపోవడంపై నడ్డా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుసగా పండుగలు వస్తున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం స్పీడ్ అందుకోలేంటూ పార్టీ శ్రేణులు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. వచ్చే 15 రోజుల్లో సభ్యత్వ నమోదు డ్రైవ్ ని వేగవంతం చేయాలని, వీలైనంత తొందరగా ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు జేపీ నడ్డా.