సిరా న్యూస్ ,భీమదేవరపల్లి
ఎంపిడిఓ గా నాగంపల్లి వీరేశం బాధ్యతలు స్వీకరణ
భీమదేవరపల్లి నూతన ఎంపిడిఓ గా నాగంపల్లి వీరేశం గురువారం బాధ్యతలు స్వీకరించారు. లోక్ సభ ఎన్నికల దృశ్యా గీసుకొండ మండలం ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న ఆయన భీమదేవరపల్లి మండలం ఎంపీడీవో బదిలీపై వచ్చారు. ఎంపీడీవో వీరేశంకు, మండల ఎంపీపీ జక్కుల అనిత, మండల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు కలిసి ఘన స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. గత ఎంపీడీవో భాస్కర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలానికి బదిలీపై వెళ్లారు.