సిరా న్యూస్, ఖానాపూర్
సొంత ఖర్చులతో మరమ్మతులు
* మనెగుండ్ల నాగరాజును అభినందిస్తున్నప్రజలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గాంధీనగర్ పోయే రూట్ లో కల్వర్టు పూర్తిగా అధ్వానంగా మారింది. దీంతో అక్కడ నుంచి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను చూడ లేక ఒక మామూలు యువకుడు శాంతినగర్ కు చెందిన మనెగుండ్ల నాగరాజు ముందుకు వచ్చారు. పక్కన ఉన్న చెత్త నీరు, కల్వర్టు సంబంధించిన మెటీరియల్ తెప్పించాడు .సోమవారం పని కార్యక్రమం చేపట్టాడు. ఎవరో వస్తారు… ఏమో చేస్తారో అనే దాన్ని నమ్మకుండా ప్రతి ఒక్క యువకుడు తనకు తోచినంత సహాయం చేయాలని మనెగుండ్ల నాగరాజు కోరుతున్నాడు. అలాగే ఖానాపూర్ పట్టణంలో రోడ్లు బాగోలేవు… అలాగే త్రాగునీటి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మిషన్ భగీరథ నీళ్లు తాగడానికి మాత్రం పనికిరావు. ఇప్పటికైనా నాయకులు పట్టించుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.