సిరా న్యూస్,అదిలాబాద్;
అదిలాబాద్ జిల్లా లో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపి గొడం నాగేష్ బిజెపి పార్టీలో చేరనున్నారు. ఈయన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్,బిజెపి ఢిల్లీ పెద్దలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. నాగేష్ కు బిజెపి నుండి అదిలాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే బిజెపి పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. పార్టీలో ఈనెల 8 వ తేదీన తన 40 మంది అనుచరులతో ఢిల్లీ బిజెపి జాతీయ అధ్యక్షుడు సమక్షంలో చేరనున్నారు. నాగేష్ కు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ మద్దతుతో బిజెపి పార్టీ చేరనున్నారు. గత ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ నుండి గోడం నాగేష్ పోటీ చేయగా బిజెపి అభ్యర్థి సోయం బాపురావు చేతిలో ఓడిపోయారు.