సిరా న్యూస్, ఓదెల
రూ.16016 లకు మహాగణపతి లడ్డూను దక్కించుకున్న నాగపురి స్వప్న రవి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గ్రామపంచాయతీ దగ్గర ఉన్న శ్రీ పార్వతి శంభు లింగేశ్వర స్వామి ఆలయంలోని మహాగణపతి లడ్డు వేలం పాటలో 16016/- రూపాయలకు నాగపురి స్వప్న రవి గెలుచుకున్నారు. వారికి వేదమంత్రాలతో లడ్డును శ్రీ పార్వతి శంభు లింగేశ్వర స్వామి గణపతి ఉత్సవ కమిటీ వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతల భవాని పరశురాం, కౌసల్య, భూసారపు లావణ్య, కోటగిరి పద్మ, కాసారాపు రాజు, భూసారపు రాకేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.