సిరాన్యూస్,జైనథ్
మానసిక ఒత్తిడికి గురికావొద్దు
* జైనథ్ మెడికల్ ఆఫీసర్ నైనత
విద్యార్థులు పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడికి గురికావొద్దని జైనథ్ మెడికల్ ఆఫీసర్ నైనత అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షా సమయంలో మానసిక ఒత్తిడి రాకుండా అవగాహన కల్పించారు. అనంతరం కిచెన్ వాటర్ ట్యాంక్ పరిశీలించారు.అనంతరం మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు.