సిరా న్యూస్, సైదాపూర్:
బీటీ రోడ్డు నిర్మించండి: నల్లనితండా వాసులు
* మంత్రి పొన్నం ప్రభాకర్ కు గ్రామస్థుల విజ్ఞప్తి
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని నల్లని తండాకు బీటీ రోడ్డు లేక చాలా సంవత్సరాల నుండి ఇబ్బందులకు గురవుతున్నామని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తండాకు నిధులు మంజూరు చేశామని చెప్పిన ఇప్పటివరకు బీటీ రోడ్డు వేసిన దాకలాలే లేవన్నారు. నల్లని తండాకు కు సరైన రోడ్డు లేకపోవడం వల్ల 108 వాహనం గ్రామంలోకి రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యను గుర్తించి తండాకు బీట్ రోడ్డు వేసేందుకు నిధులు మంజూరు చేసి తండాను అభివృద్ధి చేయాలని తండావాసులు వేడుకుంటున్నారు. కార్యక్రమంలో బాదావత్ అంజి నాయక్, బానోత్ రమేష్ నాయక్, మాలోతు రాజేందర్, గుగులోతు తిరుపతి, బర్మావత్ శంకర్, బదవత్ శంకర్, భదవత్ సాయి తేజ, భూక్యా ప్రశాంత్, భదవత్ శంకర్ తదితరులు ఉన్నారు.