Nallamala Forest: నల్లమలలో జోరుగా వేట..

సిరా న్యూస్, కర్నూలు: నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణి వేట జోరుగా కొనసాగుతుంది. ఇటీవలే కొంత మంది వేటగాళ్లను ఫారెస్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి నాటు తుపాకులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. నల్లమల అడవిలో జింకలను, దుప్పులను వేటాడి వాటి మాంసంను అమ్ముకోవడమే వృత్తిగా చేసుకున్న కొందరు వేటగాళ్లు తరుచుగా వేటకు వెళ్తున్నట్లు సమాచారం. వెలుగోడు అడవి ప్రాంతములో అడవి జంతువుల వేటకు వెళ్తున్న ఆరుగురు వేటగాళ్ళు అరెస్ట్‌ చేసి వారి వద్ద నుండి ఆరు నాటు తుపాకులు, నాటు సారాను పోలీసులు ఇటీవలే స్వాధీనం చేసుకోవడం చర్చనీయాశంగా మారింది. ఈ సందర్భంగా ఆత్మకూరు సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ నాగభూషణం మాట్లాడుతూ.. అక్రమ తుపాకులు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వెలుగోడు రిజర్వ్‌ ఫారెస్ట్‌ సమీపంలోని గట్టు తాండ వద్ద అడివిలోకి నాటు తుపాకులతో వేటకు వెళ్తున్న ఆరుగురు వ్యక్తులు అరెస్ట్‌ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని త్వరలోనే అరెస్టు చేస్తామని అన్నారు. ఎవరైనా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే స్వచ్ఛందంగా వచ్చి పోలీస్‌ స్టేషన్లో అప్పజెప్పాలని వారిపై చర్యలు తీసుకుని అవకాశం తక్కువగా ఉంటుందని సూచించారు. అరెస్ట్‌ అయిన ఆరు గురిలో అందరూ నేర చరిత్ర కలిగిన వారే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పలు సంఘటనల్లో వీరిపై అనేక కేసులు నమోదు అయ్యాయని.. వీరులో కొందరు గంజాయి, మరికొందరు సారా, మరికొందరు చిన్న చిన్న అల్లర్లలో పాల్గొన్నప్పుడు కేసులు నమోదు చేయడం జర్గిందని తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. కాగా నిందితులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *