సిరాన్యూస్, నాంపల్లి
‘డిండి’ డీపీఆర్‌ను ఆమోదించే వరకు పోరాటం ఆగదు: సీపీఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి
* తహసీల్దారుకు వినతి పత్రం అందచేత
నల్గొండ జిల్లాలో నిత్యం కరువు కాటకాలకు గురవుతూ ఫ్లోరైడ్ ప్రాంతాలైన మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను వెంటనే ఆమోదించి సాగునీరు అందించే వరకు తమ పోరాటం ఆగదని
సీపీఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి అన్నారు. శుక్రవారం నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దేవా సింగ్ కు సీపీఎం తరుపున వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా మాట్లాడుతూ మునుగోడు, దేవరకొండ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తరహా తమ ప్రాంతాలకు కూడా అన్ని అనుమతులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.