-నియోజకవర్గ ఇంచార్జ్ అందె భాస్కరాచారి
సిరా న్యూస్,మంథని;
తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారకరామారావు అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జ్ అందె భాస్కరాచారి కొనియాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి ని పురస్కరించుకొని గురువారం టిడిపి ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి,పెద్దపెల్లి పార్లమెంట్ ఉపాద్యక్షులు అందె భాస్కరాచారి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు వారి గుండెల్లో చెరగని గూడు కట్టుకున్నారని అన్నారు.ఆయన భౌతికంగా మనమద్య లేకున్నా ఆయన చేసిన అభివృద్ధి నేటికీ కళ్ళకు కట్టినట్లు కనబడుతుందని, బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివన్నారు.సినీరంగంలో రాముడు, కృష్ణుడు,పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, శ్రీకృష్ణ దేవరాయలు,లాంటి ఎన్నో పౌరాణిక పాత్రలో లీనమై నటించిన ఘనత యన్టీఆర్ కే దక్కిందన్నారు. అనంతరం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మంథని మండల అద్యక్షులు మ్యాదరబొయిన ఓదెలు, కమాన్ పూర్, రామగిరి, మలహర్ రావు,కాటారం, మహముత్తారం, మండలాల అద్యక్షులు కంటిపూడి రామకృష్ణ, వేలుపుల నారాయణ, చీర్ల మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.