నాని… అవమానకర రీతిలో నిష్క్రమణ

సిరా న్యూస్,విజయవాడ;
రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయంటారు. ఇది నిజమే. చాలామందిరాజకీయంగా అంచనాలు వేయడంలో తప్పటడుగులు వేస్తారు. తప్పిదాలకు పాల్పడతారు. మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పుడు అటువంటి మూల్యం చెల్లించుకున్నారు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నాని. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి మంచి ప్రాధాన్యత దక్కించుకున్నారు.2014, 2019 ఎన్నికల్లో టిడిపి ద్వారా ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో గెలిచారు. అదంతా తన బలమేనని భ్రమించారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఎప్పుడు రాజకీయ అవకాశాలు మూసుకుపోవడంతో.. అవమానకర రీతిలో రాజకీయాల నుంచి నిష్క్రమించారు.అయితే రాజకీయాలను కేశినేని నాని అంచనా వేయలేకపోయారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్వరం మార్చుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబుపై విధేయత కనబరుస్తూనే పార్టీని మాత్రం తక్కువ అంచనా వేశారు. ఈ ఎన్నికల్లో గెలిచే పార్టీ వైసీపీగా స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చారు. అందుకే ఉన్నట్టుండి ఆ పార్టీలో చేరిపోయారు. అయితే నాని పొలిటికల్ సూసైడ్ కు కారణం మాత్రం ముమ్మాటికి జగనే. తన పొలిటికల్ ఫ్యూచర్ పై అనేక ఆశలతో ఉండేవారు నాని. వైసిపి ప్రవేశంతో ఆయన ఆశలు నీరుగారిపోయాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు క్రమశిక్షణ పాటించలేదు. హద్దులు మీరు వ్యవహరించారు. చేజేతుల నష్టం చేసుకున్నారు.వైసిపి అధికారంలోకి వస్తుందని గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు కేశినేని నాని. అయితే అదంతా ముందస్తు ప్లాన్ ప్రకారమే చేసుకున్నారు. అందుకే వైసీపీలోకి ఇలా వెళ్లారో లేదో టికెట్ దక్కించుకున్నారు. జగన్ నేతృత్వంలో వైసిపి అధికారంలోకి వస్తుందని ఆయన ఊహ అతి. ఆత్మవిశ్వాసం ఉండవచ్చు కానీ.. ఓవర్ కాన్ఫిడెన్స్ నానిని పొలిటికల్ గా నాశనం చేసిందని విశ్లేషకుల సైతం అభిప్రాయపడుతున్నారు. ఎన్నో అవకాశాలు కల్పించి రాజకీయ ఎదుగుదలకు సహకరించిన టిడిపిని అహంకారంతో వీడారు నాని. అప్పుడే ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. ఆయన వైసీపీలో చేరడమే అతిపెద్ద తప్పు. ఇప్పుడు ఎటువంటి రాజకీయ దారులు లేకపోవడంతో.. అవమానకర రీతిలో కేశినేని నాని రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *