సిరా న్యూస్,శ్రీకాకుళం
నిజం గెలవాలి పర్యటన లో బాగంగా జిసిగడాం మండలం దవలపేట గ్రామానికి నారా భువనేశ్వరి చేరుకున్నారు. టిడిపి పోలిట్ భ్యూరో సభ్యులు కళా వెంకట్రావు,శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు ఆమెకు స్వాగతం పలికారు.చంద్రబాబు అరెస్ట్ సమయంలో మనస్థాపంతో మృతి చెందిన కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి, ఆర్దిక సహాయం చేసారు.