సిరా న్యూస్ , కళ్యాణదుర్గం
అందరి సమస్య తీర్చిన హనుమంతరావు చౌదరి
* టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అందరి సమస్య ఉన్నం హనుమంతరావు చౌదరి తీర్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సోమవారం చౌదరి ఎమ్మెల్యేగా ఐదేళ్లలో ఉన్నప్పుడు ఏం చేశారని వాగే వాళ్లకి స్వయంగా నారా లోకేష్ మాటల్లోనే చెప్పారు. శిలా పథకం వేసి మొదలు పెట్టిన వాటి గురించి ప్రస్తావించలేదు. వాటిని పోల్చుకుంటే చాలా ఉన్నాయి. మొత్తం మూడు వేల కోట్ల పైగా అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. ఇది పెద్దాయన నాయకత్వం అంటేఒక రైతు కుటుంబం నుంచి జన్మించిన వ్యక్తి కాబట్టి రైతుల గురించి తెలుసు..రైతు పడుతున్నఇబ్బందులను చూసి కళ్యాణదుర్గంనియోజకవర్గం వ్యాప్తంగా 700 పైగా కొత్త ట్రాన్స్ ఫార్మర్లు అందించిన ఘనత మన పెద్దాయన. మీరు స్టేజ్ పైన లేకపోయినా మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడుతున్నాయి. పెద్దాయన ఏది ఏమైనా నియోజకవర్గ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.అంతేకాక 40 సంవత్సరాల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కార్యకర్తలను నాయకులను కంటికి రెప్పల కాపాడుకున్నాడు. స్థానికులకు సైతం కులం మతం బేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ అందరి సమస్యలను తీర్చిన వ్యక్తి ఉన్నం హనుమంతరాయ చౌదరి.