సిరా న్యూస్,ఓదెల
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
ఓదెల మండలం గోపురపల్లి గ్రామంలో శనివారం సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీటీసీ గోపులావణ్య నారాయణ రెడ్డి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 5 లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణానికి మంజూరు చేయించారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామం ప్రత్యేక పాలనాధికారి స్రవంతి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ , పోలపల్లి బుచ్చి రెడ్డి గోపు కుమార్ రెడ్డి , బండి రవి తుంగని శ్రీనివాస్ దేవేందర్ రెడ్డి, రాజిరెడ్డి జంగ శ్రీను కిషన్ రెడ్డి, తిరుపతిరెడ్డి, నరసింహారెడ్డి , అజయ్, ప్రసాద్ , గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.