సిరాన్యూస్, బేల
అన్ని ప్రాణులకు జీవనాధారం నీరే
* బాల వికాస్ స్వచ్చంద సంస్థ కో ఆర్డినేటర్ నరేందర్
* ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం
నీరు లేకపోతే భూమి మీద జీవమే ఉండేది కాదని, అన్ని ప్రాణులకు జీవనాధారం నీరేనని బాల వికాస్ స్వచ్చంద సంస్థ కో ఆర్డినేటర్ నరేందర్ అన్నారు. సమస్త జీవజాలానికి ప్రాణాధారమైన నీటి ప్రాముక్యతను తెలియపరచడానికి ప్రతీ సంవత్సరం, మార్చ్ 22 న ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ సందర్బంగా బేల మండలంలోని సిర్సన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల వికాస్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవాని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా బేల మండల బాల వికాస్ స్వచ్చంద సంస్థ కో ఆర్డినేటర్ నరేందర్ మాట్లాడుతూ నీటిని సంరక్షించుకోవడం మన భాద్యత ఆ భాధ్యతను విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుంది అని పేర్కొన్నారు. భూమండలం మొత్తం 80% నీటితో నిండి ఉంది కానీ దానిలో అతికొద్ది శాతం మాత్రమే తాగేందుకు అనువైనది అని అన్నారు. ఆ కొద్దీ పాటి నీటిలో కూడా అధిక శాతం వాతావరణంలోని తేమ మరియు మబ్బుల రూపంలో గాలిలోనే కలిసి పోతుందని చెప్పారు. మిగతా నీరు నదుల్లోను, చెరువులు, భూమి అడుగునా భూగర్భ జలాలుగా ఉంటుందని అన్నారు. ఇంత కొద్దీ పాటి నీటిని మనం ఎంతో స్పృహతో మరియు బాధ్యతతో వాడుకోవడం ఎంతో అవసరం కానీ మనం మాత్రం బాధ్యతారాహిత్యంగా, నీటిని వృధా చేస్తూనే ఉన్నాం, చెరువులను పూడ్చి అపార్ట్మెంట్లు కడుతున్నాం, వర్షపు నీరు భూమిలోకి ఇంకెందుకు వీలులేకుండా,రోడ్లు,బిల్డింగులతో భూమిని కప్పేస్తున్నాం అని అన్నారు. దీని ఫలితంగా, ఎంతోమంది ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులను ఎదురుకుంటున్నారు అని అన్నారు. తప్పు ఎవరిదైనా దాని ఫలితం మనమంతా అనుభవిస్తున్నాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మహాలక్ష్మి, గ్రామ నీటి అభివృద్ధి కమిటీ సభ్యులు భూమా రెడ్డి, భూమన్న, కాడే రూపేష్ ,సి ఆర్ పి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.