Narender Goud: నిరుద్యోగ బ్రతుకులలో వెలుగులు నింపిన కాంగ్రెస్

సిరా న్యూస్, భీమదేవరపల్లి
నిరుద్యోగ బ్రతుకులలో వెలుగులు నింపిన కాంగ్రెస్
* యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు నారగోని నరేందర్ గౌడ్
* రేవంత్‌రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్ చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అతి త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగ బ్రతుకులలో వెలుగులు నింపడం జ‌రిగింద‌ని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు నారగోని నరేందర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన డిఏసి నోటిఫికేషన్ పైహర్షం వ్యక్తం చేస్తూ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు నారగోని నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో శ‌నివారం భీమాదేవరపల్లి మండలం ముల్కనూర్ అంబేత్కర్ చౌరస్తా దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం చేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంత్సరకాలంగా ఎప్పుడు డిఎస్సీ ఉసు తియ్యకుండా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించి వారి జీవితాలతో చెలగాటం అడి విద్యార్ధులకు అన్యాయం చేశారనిన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అతి త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగ బ్రతుకులలో వెలుగులు నింపడం జరిగింద‌న్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గుడికందుల రాజు , అసెంబ్లీ సెక్రటరీ అధారి రాజేందర్, పోగుల శ్రీకాంత్,జక్కుల అనిల్, పోగులరారాజు ,గుదికందుల వంశీకృష్ణ , గొల్లేన మహేష్, కూన ప్రశాంత్, నలివెల దిలీప్, రజనీకాంత్, తాళ్లపల్లి ప్రవీణ్, వల్లేపు మహేందర్, కన్నబోయిన రమేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *