సిరా న్యూస్,కమాన్ పూర్;
ఆర్ ఎఫ్ సిఎల్ లోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల తెలుగు అధ్యాపకులు ఉత్యం సంతోష్ నేషనల్ యూనిక్ అవార్డు పొందినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో మహతి ఆడిటోరియంలో శ్రీ స్వరవాణి కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ, స్నేహ కల్చరల్ ఆర్ట్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన నేషనల్ యూనిక్ అవార్డు 2024 ప్రధానోత్సవంలో సంతోష్ కు అకాడమీ నిర్వాహకులు మామిడిపల్లి రాజబాబు,నాగరాజులు అవార్డును ప్రధానం చేశారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 300 మంది కళాకారులు ఒకే వేదికపై కళా ప్రదర్శనలో పాల్గొని ఆయా కళాకారులు ప్రతిభను ప్రదర్శించారు. ఇందులో భాగంగా ఉత్యం సంతోష్ తన ప్రతిభను ప్రదర్శించారు. సామాజిక సేవలో చురుగ్గా పనిచేస్తూ, విద్యార్థుల్లో నైపుణ్య ప్రదర్శనకు పాటుపడుతూ, ఆధ్యాత్మిక అంశాలను వివరించడంలో ప్రధాన ప్రాంత పోషించారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు ఆలపించి పలు న్యాయ నిర్ణేతల మన్ననలు అందుకున్నారు. దీనికి గాను నేషనల్ యూనిక్ అవార్డును అందజేసి శాలువాతో సన్మానించారు.