సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవారిని న్యాచుర ల్ స్టార్ నాని దర్శించుకున్నారు.. ఇవా ళ వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్న అనంతరం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో నాని స్వామి వారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.. దర్శనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుతులకు వచ్చిన న్యాచురల్ స్టార్ నానితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.. ముందుగా అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న నాని, నిన్న రాత్రి తిరుమలలో బస చేసారు.. న్యాచురల్ స్టార్ నాని నటించిన నూతన సినిమా “hi నాన్న” సినిమా విడుదల నేపథ్యంలో స్వామివారిని ఆశీర్వాదం అందుకుని, మొక్కులు చెల్లించుకున్నారు..