సిరా న్యూస్, జైనథ్
ఛత్రపతి శివాజీ శౌర్యానికి ప్రతీక
నవుడే జగదీష్
ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను జైనథ్ మండలంలోని నిరాల గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీజే చప్పులతో గ్రామంలో ఊరే గింపు నిర్వహించారు.అనంతరం నవుడే జగదీష్ మాట్లాడుతూ ప్రతి యేట ఫిబ్రవరి 19వ తేదీన ఈ వేడుకలను జరుపుకుంటామని తెలిపారు. ఛత్రపతి శివాజీ శౌర్యానికి ప్రతీక అన్నారు.శివాజీ భారతదేశాన్ని మొగలుల బారి నుండి విముక్తి చేసి మరాఠ సామ్రాజ్యాన్ని పునాది వేసిన మహానీయుడని కొనియాడారు. 15 ఏళ్ల వయసులోని మొగలిలలపై పోరాడి ఇప్పటి యువతకు ఆదర్శం ఛత్రపతి అన్నారు.ఈ కార్యక్రమంలో చౌదరి చంద్రకాంత్, , బోయర్ దేవదాస్, బెజోడుకార్ శ్రీనివాస్, గోగువర్ ప్రవీణ్, సురేష్, ప్రభాకర్ తదితర గ్రామస్తులందరూ పాల్గొన్నారు.