సిరాన్యూస్, నేరడిగొండ
నేరడిగొండ లో ఘనంగా విమోచన దినోత్సవం
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురష్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లోని 36 పోలింగ్ బూత్ కేంద్రాలలో పోలింగ్ బూత్ అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా జరుపుకున్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన విమోచన దినోత్సవ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సాబ్లే సంతోష్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశానికి 1947 ఆగస్టు15 న స్వాతంత్రం వచ్చిన కూడా అప్పటి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కలగకుండా స్వాతంత్ర స్వేచ్ఛ వాయువును ఇక్కడి ప్రజలు పీల్చలేక పోయారు. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్నిజాం మెడలు వంచి 1948 సెప్టెంబర్ 17 న విముక్తిని కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కోట్నక్ కోటేష్, బాక్రే శేఖర్, గుండాలే దీపక్, సతీష్ చిమ్మన, గణేష్ తదితరులు పాల్గొన్నారు.