సిరా న్యూస్ చిగురుమామిడి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ
పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఇన్చా చార్జీ ప్రధానోపాధ్యాయులు కానిగంటి రాజమౌళి అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నేతాజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి పూల చే నివాళులర్పించారు. బోస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. దేశం కోసం 11 సార్లు జైలు కు వెళ్లారు, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రష్యా, జర్మన్, జపాన్ దేశాలలో పర్యటించి యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీల చే ఇండియన్ నేషనల్ ఆర్మీ ని ఏర్పాటు చేసి భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్యామయ్య, శంకరమ్మ, శంకర్, ప్రతిమ, చంద్రశేఖర్, శ్రీనివాస్ , విద్యార్థులు, పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు.