బేల, సిరా న్యూస్
నేతాజీ సేవలు మరువలేనివి
దేశ స్వాతంత్ర్యం కోసం సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాట సేవలను ఎప్పటికి మరువలేమని ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ హరీష్ రెడ్డి అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సమరంలో ఆయన పోరాటం ఎనలేనిదని అన్నారు. దేశాన్ని దాస్యశృంఖలాల నుంచి విముక్తం చేసేందుకు ‘జైహింద్’ నినాదంతో యువతను’ ఆజాద్ హింద్ ఫౌజ్’ నడిపిన స్ఫూర్తి ప్రదాత నేతాజీ అని కొనియాడారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త బర్కాడే రాము, ఏబీవీపీ నాయకులు ప్రీతం నవనీత్, కృష్ణ, సాయి, నితీష్, యోగేష్ రెడ్డి, అతుల్ తదితరులు పాల్గొన్నారు