సిరా న్యూస్, డిజిటల్:
మహిళలను మోసం చేస్తే 10 ఏళ్ల జైలు… యువత జాగ్రత!
భారత దేశంలో జూలై 1, 2024 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పాత ‘ఇండియన్ పీనల్ కోడ్’ స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ ను తీసుకురావడం జర్గింది. అయితే కొత్త చట్టంలోని సెక్షన్–69 ని ఒక సారి పరిశీలిస్తే ఇది మహిళలకు అందించిన కొత్త ఆయుధంగా వర్ణించవచ్చు. ఈ సెక్షన్ ప్రకారం… ఒక స్త్రీని వివాహాం చేసుకునే ఉద్ద్యేశ్యం లేకపోయినప్పటికీ కూడ, వివాహాం చేసుకుంటానని ఆమెను నమ్మబలికి, మోసపూరితంగా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరం. ఈ నేరం గనుక కోర్టులో రుజువైతే, నేరం చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష ఖాయం. దీంతో పాటు జరిమాన విధించే అవకాçశం కూడ ఉంది. ఈ సెక్షన్‌కు సంబంధించిన వివరణలోకి వెళ్తే… కేవలం పెళ్లి చేసుకుంటానని అబద్దపు వాగ్దానం చేయడమే కాక, ఉద్యోగం ఇప్పిస్తానని లేదా పదోన్నతి కల్పిస్తానని నమ్మబలకడం లేదా తన నిజమైన గుర్తింపును దాచి మోసపూరితంగా అమెతో శారీరక సంబంధం పెట్టుకోవడం కూడ నేరమే. అయితే ఈ సెక్షన్–69 మహిళల రక్షణ కోసమే అయినప్పటికీ కూడ 498–ఏ (గృహ హింస) తరహాలో దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నట్లు పలువురు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ స్త్రీ, పురుషులిద్దరూ ఎలాంటి షరతులు లేకుండా ఒకరినొకరు ఇష్టపడి లైంగిక సంబంధం పెట్టుకున్నప్పటీ కూడ, అటు తరువాత ఇద్దరి మధ్య ఏమైన విభేదాలు వస్తే, మహిళ ఈ కేసు పెట్టే అవకాశం లేకపోలేదని పలువురు వాపోతున్నారు. కొంత మంది మహిళలు దీన్ని అస్త్రంగా వాడుకొని, కక్ష్య సాధింపు చర్యలు, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం కూడ లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మహిళ రక్షణ కోసం ఇలాంటి చట్టాలు నేటి సమాజంలో అవసరమైనప్పటీకీ కూడ భవిష్యత్తులో తప్పుడు కేసులు పెరిగితే గనక మహిళల పెరెత్తితేనే మగవాళ్లు భయపడే పరిస్థితి వస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇప్పటీకీ ఎందరో మంది దుర్మాగుల చేతుల్లో మోసపోయిన మహిళలు నేటికి న్యాయం కోసం అనేక అగచాట్లు పడుతున్నారనేది వాస్తవమనే చెప్పవచ్చు. కానీ ఈ కొత్త చట్టం రావడం వలన మహిళలను మోసం చేయాలనే దుర్బుద్దితో, అబద్దాలతో మహిళలకు దెగ్గరయ్యే మగవాళ్లు మాత్రం శిక్ష తప్పదనే చెప్పవచ్చు. అయితే ఈ సెక్షన్–69 సద్వినియోగం అవ్వాలని, వంచింపబడిన మహిళలకు న్యాయం జర్గాలని అశిద్ధాం. చివరగా ఒక్కటి… మగవాళ్లు బి అలర్ట్… బీ కేర్‌ఫుల్… ‘ఆకొచ్చి ముళ్లు మీద పడిన… ముళ్లొచ్చి ఆకు మీద పడిన… నష్టం ఆకుకే’ (కానీ ఇక్కడ ఆకు మాత్రం మగవాడే).