సిరా న్యూస్,హైదరాబాద్;
మనదేశంలో సామాన్యులపై, మధ్యతరగతి వారిపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ పెద్ద విషయంలో మాత్రం నిశ్శబ్దంగా మారుతుంది. ఏదో ఉరుము ఉరిమినట్టు.. పిడుగు పడినట్టుఅప్పుడప్పుడు న్యాయస్థానం స్పందిస్తుంది.. కానీ అప్పటికే పెద్దలు సర్దేసుకుంటారు. చర్యలు తీసుకునేలోగానే దేశం దాటి వెళ్లిపోతారు.. ఇలాంటి ఉదంతాలు ఎన్నో మనదేశంలో చోటుచేసుకున్నాయి.
అయినప్పటికీ సామాన్యులు, మధ్యతరగతివారు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంటారు. న్యాయస్థానాల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తారు. అంత నమ్మకాన్ని కలిగి ఉన్నా వారి విషయంలో న్యాయం అనేది ఎండమావే.ఎన్నికలు లేకపోయినప్పటికీ తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి.. అధికారం పోయిందనే బాధ భారత రాష్ట్ర సమితిలో ఉంది. అధికారం దక్కిందనే గర్వం కాంగ్రెస్ పార్టీలోఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి అడుగును భారత రాష్ట్ర సమితి జాగ్రత్తగా పరిశీలిస్తోంది. భారత రాష్ట్ర సమితి పలికే ప్రతి మాటకు కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్ ఇస్తోంది. అమెరికాలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోతెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న పెట్టుబడుల నుంచి మొదలుపెడితే అమృత్ పథకం వరకు ప్రతి విషయాన్ని భారత రాష్ట్ర సమితి తెరపైకి తీసుకొస్తుండగా .. వాటికి కాంగ్రెస్ పార్టీ గట్టిగా కౌంటర్ఇచ్చుకుంటూ వస్తోంది. అయితే ఈసారి అమృత్ పథకంలో 8,888 కోట్ల అక్రమాలు జరిగాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలు గల్లి స్థాయి నాయకుడు చేస్తే పెద్దగా పట్టించుకునేవారు కాదు. సాక్షాత్తు కేటీఆర్ అనడంతో సహజంగానే వీటికి ప్రాధాన్యం ఏర్పడింది. దీనికి కౌంటర్ గా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన విషయాలు తెరపైకి తెచ్చారు.. ఒకవేళ కేటీఆర్ అన్నట్టుగా అక్రమాలు జరిగితే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. శ్రీనివాస్ రెడ్డి దీటుగా సమాధానం ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించక తప్పలేదు. ఒకవేళ అక్రమాలు జరగలేదని నిరూపిస్తే తాను
రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.పేరుపొందిన నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడంతో సహజంగానే తెలంగాణలో చర్చ మొదలైంది.. అయితే వీరిద్దరూ రాజీనామా చేస్తారా?, రాజకీయ సన్యాసం తీసుకుంటారా? నెవ్వర్. ఇలాంటి పనులు జరగవు. ఇలా రాజకీయ నాయకులు మాటమీద నిలబడరు. ఎందుకంటే అప్పటికప్పుడు ప్రజల్లో సింపతి కోసం వారు ఏవేవో కామెంట్లు చేస్తుంటారు. అంత తప్ప అందులో అవినీతిని కేటీఆర్ నిరూపించలేడు. టెండర్లను రేవంత్ రద్దు చేయలేడు.. కాకపోతే కొద్ది రోజులపాటు మీడియాకు పతాక శీర్షికల స్థాయి వార్తలు లభిస్తాయి.
సోషల్ మీడియాలో కొట్టుకోవడానికి ఉపకరిస్తాయి. అంతేతప్ప.. అంతకుమించి ఏమీ లేదు
రాజకీయ సన్యాసం చేస్తాకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కుంభకోణాలు జరిగాయని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి అమెరికా వెళ్లి పలు ఒప్పందాలు
కుదుర్చుకున్నారు. ఇందులో స్వచ్ఛ్ బయో అనే కంపెనీ కూడా ఉంది. అయితే ఈ కంపెనీ ముఖ్యమంత్రి సోదరుడికి చెందిందని.. దానికి భారీగా వ్యాపారం నిర్వహించే స్థాయి లేదని.. ఉద్యోగాలు ఇచ్చే అర్హతలేదని .. తెరపైకి సంచలన విషయాలను తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బంది కలిగించడంతో కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాల వివరాలను జయేశ్ రంజన్ విలేకరుల ఎదుటచెప్పాల్సి వచ్చింది. అయితే ఇదే సమయంలో ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ.. నాడు కేటీఆర్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భువి బయో కెమికల్స్, ధాత్రి సిలికేట్స్ కంపెనీల వ్యవహారాలనువెలుగులోకి తెచ్చింది. దీంతో ఈ పంచాయితీ అటు కాంగ్రెస్, ఇటు భారత రాష్ట్ర సమితి మధ్య కొద్ది రోజులపాటు జరిగింది. ఆ తర్వాత హైడ్రా వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ విషయాలు మొత్తంపాతవి అయిపోయాయనుకుంటా.. ఇప్పుడు కొత్తగా అమృత్ పథకానికి సంబంధించిన కాంట్రాక్టుల వ్యవహారం తెరపైకి వచ్చింది.అయితే ఇందులో పనులను ముఖ్యమంత్రి బావమరిది (సతీమణి సోదరుడు)సూదిని సృజన్ రెడ్డికి కేటాయించారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారని స్పష్టం చేశారు. దమ్ముంటే దర్యాప్తు జరిపించాలని, సీజే దగ్గరికి వెళ్దామని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నైనా ఆశ్రయిద్దామని కేటీఆర్ సవాల్ చేశారు. అంతకుముందు ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. అమృత్పథకంలో అవినీతి జరిగిందని చెబితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పొంగులేటి సవాల్ విసిరారు. పొంగులేటి సవాల్ విసిరిన ఒక్కరోజు తర్వాత కేటీఆర్ మీడియా ముందుకు వచ్చారు.అమృత్ పథకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని.. రేవంత్ రెడ్డి తన సొంత బామ్మర్ది కి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారం రేవంతం మెడకు చుట్టుకుంటుందని హెచ్చరించారు..
“సృజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయాన బావమరిది. ఆయన కంపెనీకి రెండు కోట్ల లాభం మాత్రమే ఉంది. అలాంటి కంపెనీకి వెయ్యి కోట్ల కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారు? ఇలా ఎందుకు చేశారు?ఇందులో అవినీతి లేదని చెబితే ఎవరైనా నమ్ముతారా” అని కేటీఆర్ ఆరోపించారు.. తప్పని ఒప్పుకొని టెండర్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.”రేవంత్ టెండర్లను రద్దు చేయని పక్షంలోసోనియా గాంధీ, అశోక్ చవన్, యడ్యూరప్ప మాదిరిగా పదవులను కోల్పోవాల్సి ఉంటుందని” కేటీఆర్ అన్నారు.. కేటీఆర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. కేటీఆర్ కుధీటుగా సమాధానాలు ఇస్తోంది.