సిరా న్యూస్,చిత్తూరు;
చిత్తూరు జిల్లా, పుంగనూరు, సోమల మండలం, యానాదివాడకు చెందిన గంగాధర్ విద్యుత్ తీగల తగిలి మృతి చెందడంతో వాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేవలకుప్పం అటవీ ప్రాంతంలో గొర్రెల కాసేందుకు ముగ్గురు యువకులు వెళ్ళారు. కొన్ని గొర్రెలు కనబడకపోవడంతో తిరిగి అడవిలోకి యువకులు వెళ్ళి వెతికారు. అడవి పందులు, వన్యప్రాణులు, పొలాలను నాశనం చేస్తున్న నేపథ్యంలో రైతులు విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. యువకులు చూసుకోకుండా కరెంట్ తీగలు తగలడంతో గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇరువురికి తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సదుం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు. మూడు నెలల క్రితం వివాహం చేసుకున్న గంగాధర్ విగతజీవిగా కనపడడం ఆసుపత్రి వద్ద కుటుంబసభ్యులు, గ్రామస్తులు రోదిస్తున్నారు.