సిరా న్యూస్,హైదరాబాద్;
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) తెలంగాణ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులిచ్చింది. మౌలిక సదుపాయాల కల్పన మీద తీసుకుంటున్న చర్యల మీద 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్సీ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన మీద నివేదిక ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ , మౌలిక సదుపాయాలు విద్యా ప్రమాణాలు బాగాలేవని ఎన్ హెచ్ ఆర్సీ కి కార్పొరేటర్ శ్రవణ్ కంప్లైంట్ చేసారు.
=====