సిరాన్యూస్, చిగురుమామిడి
రోడ్డు ప్రమాదంలో ముక్కిస నీలాంబర రెడ్డి మృతి
చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం స్టేజి సమీపంలో బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిస నీలాంబర రెడ్డి (38) బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిస నీలాంబర రెడ్డి అనే వ్యక్తి బుధవారం రాత్రి 11 గంటలకు కోహెడ నుండి ఇందుర్తి, ముదిమాణిక్యం రోడ్‌లో సిఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్న క్రమంలో ముదిమాణిక్యం స్టేజి సమీపంలో కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అతనిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.మృతిని భార్య ముక్కిస అనూష (26) చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై బండి రాజేష్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.మృతుడు ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది.