మారణాయుధాలు స్వాధీనం
సిరా న్యూస్,రంగారెడ్డి;
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోక్బర్ హిల్స్ కాలనీలోని ఒక ఒక ప్లాట్ లో మారణాయుధాలు కలిగి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అరెస్టు అయిన వ్యక్తుల వద్ద మూడు కత్తులు రెండు పీస్టల్స్ ఒక గొడ్డలితో పాటు పలు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మార్పీఎస్ నేత నరేందర్ కిడ్నాప్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ వ్యక్తులు రౌడీషీటర్లు కూడా అయ్యుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు